Breaking News

ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? మరి ఏ ఫారం సరైనదో తెలుసా?

ఐటీఆర్ ఫారమ్ సెలెక్ట్ చేసుకోవటం నుంచి టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవటం ఏ ఫారం సరైనదో తెలుసుకోవడం ముఖ్యం.


Published on: 04 Jun 2025 13:39  IST

పన్ను చెల్లింపుదారులకు హెచ్చరిక! ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్ దాఖలుకు గడువు సమీపిస్తుండటంతో, త్వరగా మరియు సరిగ్గా ఫైలింగ్ చేయడం అత్యంత ముఖ్యం. చివరి నిమిషంలో హడావుడిగా ఫారమ్‌లను పూరించడంతో అనేకమంది తప్పులు చేస్తుంటారు. అటువంటి పొరపాట్ల వల్ల తర్వాత పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు.

ప్రభుత్వం ఇటీవల కొన్ని సాంకేతిక మార్పులు చేసిన నేపథ్యంలో, పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. కొత్త ఐటీఆర్ ఫారమ్‌లతో పాటు, వాటికి సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యుటిలిటీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, మీ ఆదాయానికి అనుగుణంగా సరైన ఫారమ్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంచుకోవడంపై పూర్తిపరిచయం

1. ITR-1 (సహజ్):
ఈ ఫారమ్ వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్న వ్యక్తులకు అనుకూలం. మీ ఆదాయం ఈ వర్గాల్లోకి వస్తే మీరు ఈ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు:

  • ఉద్యోగం లేదా పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం

  • ఇంటి అద్దె ఆదాయం (ఒక ఆస్తికి పరిమితం)

  • బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ

  • వ్యవసాయ ఆదాయం రూ.5000 లోపు                                                                                                                                                                  

గమనిక: వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఆదాయం ఉన్నవారు ఈ ఫారమ్‌ను ఉపయోగించరాదు.

2. ITR-2:
ఈ ఫారమ్ ITR-1 వర్తించని, కానీ వ్యాపార/ప్రొఫెషనల్ ఆదాయం లేని వ్యక్తులకు వర్తిస్తుంది:

  • ఒక్కరికి మించి ఆస్తులు కలిగివుండటం

  • మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు ఉండటం

  • విదేశీ ఆదాయం ఉండటం

ఇది ప్రధానంగా సంపద మీద ఆధారపడి ఆదాయమున్న వారికి అనుకూలం.

3. ITR-3:
ఇది వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్స్ కోసం రూపొందించబడింది:

  • వ్యాపారం, దుకాణం, కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్

  • ఖాతాలు నిర్వహించాల్సిన అవసరమున్న వారు

  • భాగస్వామ్య సంస్థల నుంచి ఆదాయం పొందేవారు

ఈ ఫారమ్ ద్వారా వ్యాపార లాభనష్టాల పూర్తి వివరాలను ఇవ్వాలి.

4. ITR-4 (సుగమ్):
ఇది చిన్న వ్యాపారులు మరియు స్వతంత్ర వృత్తివేత్తల కోసం రూపొందించబడింది:

  • వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు

  • ప్రెజంప్టివ్ ట్యాక్స్ స్కీం (ఆకలించి పన్ను చెల్లింపు)

  • వైద్యులు, ఇంజనీర్లు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు

ఈ ఫారమ్ ద్వారా తక్కువ సమాచారం సరిపోతుంది – దీనివల్ల తక్కువ తప్పులు జరుగుతాయి.

  • అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్దం చేసుకోండి

  • ఐటీఆర్ ఫైలింగ్ చేసే ముందు, ఏ ఫారమ్ మీకు వర్తిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోండి

  • ఆఫిషియల్ పోర్టల్ (https://incometax.gov.in) నుంచి తాజా మార్గదర్శకాలు పరిశీలించండి

  • తప్పినా నోటీసులు రాకుండా ఉండాలంటే, అనుభవజ్ఞుల సహాయం తీసుకోండి

పన్ను చెల్లింపులో పారదర్శకత, సమయపాలన చాలా అవసరం. ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన ఆదాయానికి తగిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంపిక చేసి, సమయానికి దాఖలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. జాగ్రత్తగా పన్ను ఫైలింగ్ చేయడం వల్ల తరువాత ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి