Breaking News

లేడీ అఘోరీ పై సీబీ-సీఐడీ విచారణ?.. బిటెక్ విద్యార్థినిపై ఆమె లైంగిక దాడులు చేసిందా?..

బీటెక్ చదివిన శ్రీవర్షిణితో పరిచయం పెంచి, ఆమెను లేడీ అఘోరీ మాయమాటలు చెప్పి తన వైపు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Published on: 29 Mar 2025 16:54  IST

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వివాదం 
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆలయాల వద్ద వివిధ కార్యక్రమాలతో సనాతన ధర్మం పేరిట వార్తల్లో నిలిచిన లేడీ అఘోరి నాగ సాధు, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణితో లైంగిక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఆమెపై వస్తున్నాయి.

లేడీ అఘోరి ఎవరు?
ఈ లేడీ అఘోరి అసలు పేరు అల్లూరి శ్రీనివాస్. పురుషుడిగా జన్మించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నానని, తాను అమ్మవారిగా దీక్ష తీసుకున్నానని చెప్పుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ, తన పద్ధతులతో మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.ఇటీవల ఓ యువతితో లైంగిక సంబంధాలున్నాయన ఆరోపణలు వచ్చాయి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో లేడీ అఘోరి మాట్లాడుతూ, సీబీ-సీఐడీ తనను పరిశీలిస్తోందని స్వయంగా అంగీకరించింది. తాను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, తనపై నిఘా కొనసాగుతోందని తెలిపింది.శ్రీవర్షిణిని దురుద్దేశ్యంతో లొంగదీసుకున్నాననే ఆరోపణలపై స్పందించిన ఆమె, తాను శరీరంతో సహా శివునికి అర్పించిన వ్యక్తినని తనకు అలాంటి దురాలోచనలు ఎలా కలుగుతాయని ప్రశ్నించింది. 

నిజంగా ఆమె నాగ సాధువేనా?
లేడీ అఘోరి తాను నాగ సాధువునని ప్రకటించుకుంటున్నా, నిజమైన నాగ సాధువుల ఆచారాలకు ఇది విరుద్ధంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. సాధారణంగా నాగ సాధువులు జన సమూహాలకు దూరంగా ఉంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తారు. కానీ, లేడీ అఘోరి తరచూ మీడియా ముందుకు రావడం, వివాదాలకు కారణమవడం అనుమానాలకు తావిస్తోంది.

శ్రీవర్షిణితో లేడీ అఘోరి సంబంధం
బీటెక్ చదివిన శ్రీవర్షిణితో పరిచయం పెంచి, ఆమెను లేడీ అఘోరీ మాయమాటలు చెప్పి తన వైపు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి      పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగా అఘోరీ వద్దకు వెళ్లానని శ్రీవర్షిణి పోలీసులకు చెప్పింది.

దీనిపై వర్షిణి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు.అయితే, నిత్యం వివాదాలతో ఉండే అఘోరీ వద్దకు యువతిని చేరడం పై సమాజం నుంచి విమర్శలు వస్తున్నాయి.  వర్షిణీ అన్న కూడా తనతో లేడీ అఘోరీ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. కానీ ఈ ఆరోపణలును లేడీ అఘోరీ కొట్టిపారేసింది. వర్షిణి దీక్ష తీసుకోవడం కోసం మాత్రమే తన వద్దకు వచ్చిందని, ఆమె వెళ్లాలనుకుంటే తాను అడ్డుకోనని చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి