Breaking News

ట్రంప్‌ను ఢీకొని గెలిచిన మీరా నాయర్ కుమారుడు న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ చరిత్ర సృష్టించాడు”

ట్రంప్‌ను ఢీకొని గెలిచిన మీరా నాయర్ కుమారుడు — న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ చరిత్ర సృష్టించాడు”


Published on: 05 Nov 2025 09:59  IST

అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్‌దానీ ఘన విజయం సాధించారు. భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడైన మమ్‌దానీ ఉగాండా మూలాలున్న కుటుంబానికి చెందినవారు. కేవలం 34 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికై ఆయన కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఎన్నిక రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మమ్‌దానీ గెలవకుండా చూడాలని ట్రంప్ బహిరంగంగా ప్రయత్నించగా, చివరికి ఓటమి ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మమ్‌దానీ నగర ప్రజలకు ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారు. న్యూయార్క్‌లో ఉచిత సిటీ బస్సు ప్రయాణాలు, అద్దెల నియంత్రణ, పిల్లల సంక్షేమ పథకాల అమలు, కనీస వేతనాల పెంపు, అలాగే సంపన్నులపై పన్నులు పెంచి సామాన్యులకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ వాగ్దానాలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాయి. ట్రంప్ వ్యతిరేకత మధ్య ధైర్యంగా ముందుకు సాగిన మమ్‌దానీ విజయం డెమోక్రాటిక్ పార్టీకే కాకుండా వలసజాతుల గర్వకారణంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి