Breaking News

ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం 10 మంది ఉగ్రవాదులు హతం!

ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం అస్సాం రైఫిల్స్, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.


Published on: 15 May 2025 09:41  IST

మయన్మార్‌కు సరహద్దుగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా దగ్గర బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యూసమ్‌తాల్ గ్రామం సమీపంలో అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో, భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.ఈ సమాచారంతో అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించింది. గాలింపు చర్యల సమయంలో భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు.  భారత దళాలు సమర్థంగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో సుమారు 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు కమాండ్ వెల్లడించింది. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలు మరింత కఠినతరం చేశాయి, ఎందుకంటే ఇంకా కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి