Breaking News

16న ఏపీ పర్యటనుకు ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

16న ఏపీ పర్యటనుకు ప్రధాని మోదీ.. ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష


Published on: 09 Oct 2025 09:49  IST

ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

బుధవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు.

భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి

ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి స్థాయిలో భద్రతా వ్యవస్థలు సమన్వయంగా పనిచేయాలని, ప్రజా ర్యాలీ ప్రాంతాల్లో క్రమశిక్షణ పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రధాని పర్యటన వివరాలు

ప్రధాని మోదీ మొదట కర్నూలు జిల్లాకు చేరుకుని, అక్కడి నుంచి శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరతారు. అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే విపులమైన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని ప్రధాని వెంట వేదికపై ఉంటారు.

ప్రజా సౌకర్యాలపై సీఎం ఆదేశాలు

సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పర్యటనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

ప్రధాని పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి