Breaking News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో శ్రీలంక (Sri Lanka), థాయ్‌లాండ్‌ (Thailand)లో పర్యటించనున్నారు.


Published on: 28 Mar 2025 14:26  IST

ప్రధాని శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనల షెడ్యూల్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 3-4 తేదీల్లో ఆయన థాయ్‌లాండ్‌ను సందర్శించనున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ కానున్నారు. ఏప్రిల్ 4న బ్యాంకాక్‌లో నిర్వహించే ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) సమావేశంలో పాల్గొని, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఇతర దేశాధినేతలతో చర్చించనున్నారు.

థాయ్‌లాండ్ పర్యటన పూర్తయిన అనంతరం ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళ్లనున్నారు. అక్కడ ఏప్రిల్ 6వ తేదీ వరకు పర్యటిస్తారు. గత ఏడాది భారత్‌ను సందర్శించిన శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిసనాయకే ఇచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వివిధ ఒప్పందాలపై ప్రధాని చర్చించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి