Breaking News

నగదు అవసరం ఉన్నప్పుడల్లా కనిపించిన ఏటీఎంల్లోకి వెళ్లి కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారా?..

ఏటీఎం చార్జీలను పెంచుకొనేందుకు బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం అనుమతి ఇచ్చింది మరి. ప్రతి నెలా ఉచిత నగదు ఉపసంహరణలకున్న పరిమితి దాటితే ఒక్కో నగదు ఉపసంహరణ పై చార్జీల మోత..


Published on: 29 Mar 2025 13:40  IST

ఏటీఎం చార్జీలు పెరుగుతున్నాయి – ఇకపై జాగ్రత్త!

ముంబై, మార్చి 28: అవసరమైనప్పుడు ఏటీఎంలకు వెళ్లి కార్డు స్వైప్ చేసి నగదు ఉపసంహరణలు చేస్తున్నారా? అయితే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా బ్యాంకులకు ఏటీఎం చార్జీలు పెంచుకునే అనుమతిని ఇచ్చింది.

ప్రతి నెల బ్యాంక్‌ ఏటీఎంల్లో ఐదుసార్లు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను ఉచితంగానే జరుపుకోవచ్చు. అలాగే ఇతర బ్యాంక్‌ ఏటీఎంల్లో మూడుసార్లు (హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో) ఈ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. నాన్‌ మెట్రో నగరాల్లోనైతే ఐదుసార్లు ఫ్రీ. అయితే ఈ పరిమితులు దాటితే రూ.21 చార్జీ వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.21 చార్జీని రూ.23కి పెంచనున్నారు. మే 1 నుండి ఈ కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. దీనిని సంబంధించి తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ అధికారిక సర్క్యులర్‌ను జారీ చేసింది.

రంజాన్ రోజున కూడా బ్యాంకుల సేవలు యథావిధిగా

ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చి 31న ముగియనుంది. రంజాన్ పండుగ వచ్చినప్పటికీ, ఈ సోమవారం రోజు బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా రంజాన్ పండుగకు బ్యాంకులకు సెలవు ఉంటుంది. కానీ మార్చి 31 ఆర్థిక సంవత్సరపు చివరి రోజు కావడం వల్ల,  ఐటీ ఆఫీసులు, సీజీఎస్టీ కార్యాలయాలతో సహా ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమవారం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) కింద ప్రత్యేక క్లియరింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.

  • ప్రెజెంటేషన్ టైం: సాయంత్రం 5:00 – 5:30

  • రిటర్న్ సెషన్ టైం: రాత్రి 7:00 – 7:30

కాబట్టి, రంజాన్ రోజు అయినప్పటికీ బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి