Breaking News

బతుకమ్మ–దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బతుకమ్మ–దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


Published on: 24 Sep 2025 09:59  IST

బతుకమ్మ, దసరా పండుగల కోసం ఊళ్లకు వెళ్లే ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 7 వేలకుపైగా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభం కానున్నాయి. గతేడాది కంటే ఈసారి అదనంగా 617 బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

అధికారులు చెబుతున్నట్లుగా, ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి తెస్తారు. టికెట్లు ముందుగానే tsrtc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ సూచించింది. అలాగే స్పెషల్ సర్వీసుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 040-69440000 లేదా 040-23450033 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి