Breaking News

ఢిల్లీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల


Published on: 01 Oct 2025 09:46  IST

కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 15. 

పోస్టుల సంఖ్య: 737. కానిస్టేబుల్ (డ్రైవర్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్మీడియట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అప్లికేషన్స్ గడువు ముగిసే నాటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్  ఉండాలి. వెహికల్ రిపేర్​పై కనీస పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. 1995, జులై 02వ తేదీ నాటి కంటే ముందు గానీ, 2004, జులై 01వ తేదీ తర్వాత గానీ జన్మించిన వారై ఉండరాదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 24.  

లాస్ట్ డేట్: అక్టోబర్ 15. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 100.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎండ్యురెన్స్ అండ్ మెజర్​మెంట్ టెస్ట్ (పీఈ అండ్ ఎంటీ), ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2025 డిసెంబర్/ 2026, జనవరి.

పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి