Breaking News

SBI Notification - 8283 పోస్టుల భర్తీకి ఎస్బీఐ భారీ నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీఐ).. దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది.


Published on: 20 Nov 2023 14:31  IST

హైదరాబాద్‌: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది. జూనియర్‌ అసోసియేట్‌ (క్లరికల్‌ క్యాడర్‌) పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 525 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ లేదా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల వయసు ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారని వివరించింది. వివరాలకు https://sbi.co.in /web/careers/current-openings సంప్రదించాలని కోరింది.

Follow us on , &

Source From: ntnews

ఇవీ చదవండి