Breaking News

THDCలో మేనేజర్ ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ చేసినోళ్లకి మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..

THDCలో మేనేజర్ ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ చేసినోళ్లకి మంచి ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి..


Published on: 06 Nov 2025 16:33  IST

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీ రత్న కంపెనీ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్​మెంట్ కార్పొరేషన్ (THDC) అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 06. పోస్టుల సంఖ్య: 40. 

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) ఈ–3 గ్రేడ్ 15, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) ఈ–3 గ్రేడ్ 10, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) ఈ–3 10, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఈ–3 గ్రేడ్ 05. 

ఎలిజిబిలిటీ
 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీ (ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్​ ఇండియాలో ఏఎన్​డీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 

వయోపరిమితి: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 35 ఏండ్లు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 37 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 07.  

లాస్ట్ డేట్: డిసెంబర్ 06. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీబీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.600. 

సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు thdc.co.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి