Breaking News

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.


Published on: 10 Apr 2025 15:57  IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం స్కూళ్లలో ఉదయం పూట మాత్రమే తరగతులు నిర్వహించబడుతున్నప్పటికీ, సెలవులు ముందస్తుగా వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

విద్యాశాఖ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయని, జూన్ 12వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 46 రోజుల పాటు విద్యార్థులకు విశ్రాంతి లభించనుంది.

ఇక ఇంటర్ విద్యార్థుల విషయానికి వస్తే, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవుల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇవ్వబడ్డాయి. జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. వేసవి సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

  • పాఠశాల సెలవులు: ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు

  • పాఠశాలలు పునఃప్రారంభం: జూన్ 12

  • ఇంటర్ సెలవులు: మార్చి 31 నుంచి జూన్ 1 వరకు

  • ఇంటర్ క్లాసులు ప్రారంభం: జూన్ 2

Follow us on , &

ఇవీ చదవండి