Breaking News

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా..ఒకో కార్మికుడికి రూ. 1,95,610 ఇవ్వనున్నట్లు నిర్ణయం

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా..ఒకో కార్మికుడికి రూ. 1,95,610 ఇవ్వనున్నట్లు నిర్ణయం


Published on: 23 Sep 2025 10:23  IST

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఈ దసరా పండుగను మరింత ప్రత్యేకం చేసింది. సింగరేణి లాభాల్లో 34 శాతం బోనస్‌గా కార్మికులకు పంచాలని నిర్ణయించింది. దీంతో ఒక్కో ఉద్యోగికి సుమారు ₹1,95,610 జమ కానుంది. ఈరోజు (మంగళవారం) కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం ₹819 కోట్లు జమ అవుతున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బహుమతి ఇవ్వనుంది. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి ₹5,500 చొప్పున అందజేయనుంది. ఈ బోనస్ మొత్తం సింగరేణి సంస్థ గత సంవత్సరం ఆర్జించిన ₹2,360 కోట్ల లాభంలో భాగంగా ఇవ్వబడుతోంది.

దసరా కానుకతో మాత్రమే కాకుండా, దీపావళి పండుగకు కూడా లాభాల్లో వాటా పంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది సింగరేణి కార్మికులు వరుసగా రెండు పండుగల్లో ఆనందోత్సవాలు చేసుకోనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ బోనస్‌తో కార్మికుల కుటుంబాలు పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి