Breaking News

అలహాబాద్‌ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అలహాబాద్‌ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి - ఒకరు ఆత్మహత్య, మరొకరు గుండెపోటుతో మరణం - మృతుల ఘటనపై కమిటీ వేసిన అధికారులు


Published on: 01 Apr 2025 14:08  IST

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అఖిల్ (21) గుండెపోటుతో మరణించగా, అతని సన్నిహితుడైన కృష్ణా జిల్లాకు చెందిన రాహుల్ చైతన్య (21) మనస్తాపంతో వసతి గృహం ఐదవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడ.

ట్రిపుల్‌ ఐటీలో చేరినప్పటి నుంచి అఖిల్‌, రాహుల్‌ చైతన్యలు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారని అఖిల్‌ మరణాన్ని తట్టుకోలేకనే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. చెవుడు, మూగ సమస్యలను ఎదుర్కొంటున్న రాహుల్‌కు అఖిల్‌ అండగా ఉండేవాడని స్నేహితులు వివరించారు.

విద్యార్థుల మృతిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.  విచారణ జరుపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో వారి ఆందోళనను విరమించారు.

Follow us on , &

ఇవీ చదవండి