Breaking News

డిఫెన్స్ అకాడమీలో వందల ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే...

డిఫెన్స్ అకాడమీలో వందల ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే...


Published on: 12 Dec 2025 18:26  IST

భారత త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం. ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ)– I 2026 నోటిఫికేషన్​ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హతతో  ఎంపికైన అభ్యర్థులు ఉచితంగా డిగ్రీ చదవవచ్చు. శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో  లెఫ్టినెంట్, సబ్ - లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితం ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 10.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: 2025, డిసెంబర్ 31. 

పరీక్ష తేదీ: 2026, ఏప్రిల్ 12.

ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ ఏపీలో విజయవాడ, తిరుపతి, అనంతపురం.

రిజల్ట్స్: 2026, మే ( తేదీ తాత్కాలికం).

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, జూన్ నుంచి జులై వరకు. 

పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

Follow us on , &

ఇవీ చదవండి