Breaking News

రాజాసింగ్‌ను స‌స్పెండ్ చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్

KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు.


Published on: 17 Mar 2025 13:45  IST

KTR | హైద‌రాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మ‌ల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5 గంట‌లకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి