Breaking News

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే పై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన స్కిట్‌ తీవ్ర వివాదాస్పదమైంది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే పై కునాల్‌ కమ్రా చేసిన స్కిట్‌ మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Published on: 24 Mar 2025 15:05  IST

ఖార్ ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా స్టాండ్‌ప్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్రా ప్రధానంగా మహా రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనపై దేశద్రోహానికి సంబంధించిన ఆరోపణలు చేస్తూ వ్యాఖ్యానించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్‌ కా కమల్‌’ అంటూ ఎద్దేవా చేస్తు స్పందించారు. దీనితో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా షో నిర్వహించిన హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆందోళన చేపట్టారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తమై, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో హాబిటాట్ కామెడీ క్లబ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్లబ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు హాబిటాట్ స్టూడియో అధికారికంగా ప్రకటించింది.

ఈ ఘటన రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.

Follow us on , &

ఇవీ చదవండి