Breaking News

భారతీయ జనతా పార్టీ (BJP)లో జాతీయాధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవుల భర్తీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోంది.

భారతీయ జనతా పార్టీ (BJP)లో జాతీయాధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవుల భర్తీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోంది.


Published on: 19 Mar 2025 16:56  IST

భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవుల భర్తీపై వేగంగా కసరత్తు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు సహా వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవుల భర్తీపై కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆలస్యం అవుతున్న ఈ ప్రక్రియను కొత్త హిందూ సంవత్సరంలో పూర్తిచేసి కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. పార్టీ జాతీయ మండలి సమావేశం ఏప్రిల్ 18-20 తేదీల్లో బెంగళూరులో జరగనున్న నేపథ్యంలో, ఆ సమయంలో కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీలో జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం విస్తృతస్థాయి కసరత్తు ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 36 రాష్ట్ర యూనిట్లలో, ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తయింది. త్వరలో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఒడిశా, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం, కనీసం సగం రాష్ట్రాలలో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయాధ్యక్షుడి ఎంపిక చేయాలి.

పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రతినిధి సమావేశం సందర్భంగా, పార్టీ అధ్యక్ష పదవులు ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలైన ఏబీవీపీ నేపథ్యం కల్గినవారికే అధ్యక్ష పదవులు అప్పగించాలని సమాలోచనలు జరుగుతున్నాయి.

ఈ సారి రాష్ట్రాధ్యక్షుల నియామకంలో ఏబీవీపీ, ఇతర సంఘ్ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే జరిగిన మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో ‘సంఘ్’ నేపథ్యం కల్గినవారికే ప్రాధాన్యత లభించింది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశముందా?

  • పంజాబ్ సహా కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా,
    సమన్వయ లోపం వల్ల పార్టీకి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి.
  • విద్యార్థి దశ నుంచే పార్టీతో అనుబంధం ఉన్న నేతలకు,ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలైన ఏబీవీపీ నేపథ్యం కల్గినవారికే అధ్యక్ష పదవులు అప్పగించాలని సమాలోచనలు జరుగుతున్నాయి.
  • కానీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా రేసులో ఉండటంతో, చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

కొత్త అధ్యక్షుల ప్రకటన త్వరలోనే

మార్చి 30తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించి, అనంతరం జాతీయ మండలి సమావేశంలో అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ, ఉమ్మడి నిర్ణయాల ప్రకారమే అధ్యక్ష నియామకాలు జరగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి