Breaking News

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య - కాంగ్రెస్​లో వర్గపోరే హత్యకు కారణం - గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

ఆధిపత్య పోరు హత్యకు దారితీసింది. సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్​ నాయకుడు మెంచు చక్రయ్య హత్యకు గురయ్యారు.


Published on: 19 Mar 2025 17:29  IST

గ్రామంలో ఉద్రిక్తత: ఆధిపత్య పోరుతో మాజీ సర్పంచ్ హత్య

మహబూబాబాద్: వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్తున్న మెంచు చక్రయ్యపై అదే వర్గానికి చెందిన కనకటి వెంకన్న అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. తలపై ఆయుధంతో బలంగా నరికారు. కాళ్లుచేతులు విరగ్గొట్టారు. అపస్మారక స్థితిలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ దారి నుంచి గొర్రెలు కాచుకుంటూ వెళ్తున్న కాపరి గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న చక్రయ్య అనుచరులు హుటాహుటిన సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాజకీయ వైరం.. వ్యక్తిగత దాడికి దారితీసింది

పోలీసుల వివరాల ప్రకారం, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్​, మాజీ మంత్రి ఆర్​.దామోదర్​ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గతంలో దామోదర్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఇటీవల మందుల సామెల్​ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దామోదర్​ రెడ్డిని తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యే సామెల్​ హెచ్చరించారు.

ఇదే సమయంలో మెంచు చక్రయ్య - కనకటి వెంకన్న మధ్యన కూడా రాజకీయ విభేదాలు ముదిరాయి. కొన్నేళ్లుగా గ్రామ స్థాయిలో ఆధిపత్య పోటీ నడుస్తోంది. బీఆర్​ఎస్​లో ఉన్న ఓ వర్గానికి నాయకుడైన కనకటి వెంకన్న ఇటీవల అధికార పార్టీలో చేరారు. ఆయన చేరికపై ఎమ్మెల్యే సామెల్​, దామోదర్​ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. నాటి నుంచి మామ, అల్లుడి మధ్య ఆధిపత్య పోరుతో గ్రామంలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దారికాచి హత్య.. పోలీసులు బందోబస్తు

గత కొంతకాలంగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా, చివరకు హత్యకు దారితీసింది. మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కొత్తగా ఓ పెయింట్ షాప్ ప్రారంభించిన చక్రయ్య సాయంత్రం తన వ్యవసాయ బావికి వెళ్లే క్రమంలో దుండగులు దారికాచి హత్య చేశారు.

పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి పరిరక్షణకు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి