Breaking News

తుర్కియేకి బలమైన సందేశం పంపాం - భారత్‌


Published on: 22 May 2025 18:25  IST

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతుగా నిలవడాన్ని భారత్‌ తీవ్రంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామని, పాకిస్థాన్‌కు మద్దతిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని తుర్కియే ప్రోత్సహించినట్లు భావించాల్సి వస్తుందనే సందేశాన్ని పంపించామని భారత్‌ వెల్లడించింది.ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ ఓ విధానపరమైన సాధనంగా ఉపయోగించకుండా నిరోధించాలని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి