Breaking News

ఏపీలో భారీ అగ్నిప్రమాదం


Published on: 03 Jul 2025 10:52  IST

గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో ఓ షాపులో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ పందిరి కొంత మేర దగ్ధమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేయడంతో మంటలను ఆర్పివేస్తున్నారు అధికారులు. అగ్నిప్రమాదం జరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి