Breaking News

మరో 65 ఎలక్ట్రిక్‌ బస్సులు


Published on: 10 Dec 2025 10:49  IST

గ్రేటర్‌లో బుధవారం కొత్తగా 65 ఎలక్ర్టిక్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్‌ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్‌ డిపోలో కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. గ్రేటర్‌లో రెండేళ్లలో మొత్తం 2,800 ఎలక్ర్టిక్‌ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.గ్రేటర్‌లో ఇప్పటికే 297 ఎలక్ర్టిక్‌ బస్సులను నడుపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి