Breaking News

కారు బోల్తా పడి పొలాల్లోకి ముగ్గురు మృతి

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా గ్రామ సమీపంలో NH44 జాతీయ రహదారిపై ఈ రోజు (డిసెంబర్ 10, 2025) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 


Published on: 10 Dec 2025 15:08  IST

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా గ్రామ సమీపంలో NH44 జాతీయ రహదారిపై ఈ రోజు (డిసెంబర్ 10, 2025) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

కారు వేగంగా వస్తుండగా, మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, కారు బోల్తా పడి వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది.మృతులను ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్ మరియు లక్ష్మీనగర్ వాసులైన షేక్ మొయినుద్దీన్, కీర్తి సాగర్, మరియు మొయిన్‌గా గుర్తించారు. వీరి వయస్సు 22 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది.కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి యోగేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉంది.వీరంతా మహారాష్ట్రలోని వాణికి మేస్త్రీ పనికి వెళ్లి తిరిగి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి