Breaking News

జాతీయ హైవేలపై ప్రమాదాల కట్టడికి


Published on: 16 Dec 2025 13:57  IST

దేశంలోని ఎక్స్‌ప్రె్‌సవే, జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల కట్టడికి ఏకీకృత నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదాల సమస్య ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యవహారం కాదని, దేశవ్యాప్తంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాన్‌-ఇండియా తరహా నిబంధనలు తీసుకువస్తే తప్ప రహదారి ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది.

Follow us on , &

ఇవీ చదవండి