Breaking News

విమానం కూలిన ఘటనలో 49 మంది మృతి..


Published on: 24 Jul 2025 18:03  IST

రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.అదృశ్యమైన కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు అధికారులు నిర్ధరించారు. టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.ఈ ప్రమాదానికి ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌ తప్పిదమే కారణమని అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి