Breaking News

రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్ మృతి


Published on: 26 Dec 2025 15:41  IST

అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లాకు చెందిన పునీత్ యాదవ్ (23) గౌలిదొడ్డిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై పునీత్, అతడి స్నేహితుడితో కలిసి గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలికి వస్తున్నాడు. అయితే పునీత్ వేగంగా బైక్‌ను నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి