Breaking News

పోలీసులను తప్పుదోవ పట్టించిన నిందితులు


Published on: 02 Feb 2026 18:56  IST

హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐఏటీఎం వద్ద జరిగిన కాల్పులకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ఘటనలో నిందితులు చాలా తెలివిగా వ్యవహరించి.  పోలీసులనే తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గత శనివారం ఉదయం బ్యాంక్ ఏటీఎం‌లో రూ.6 లక్షల నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన రిన్షద్ అనే వ్యక్తిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రిన్షద్ కాలికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డారు. అనంతరం దుండగులు.. బాధితుడి స్కూటీపైనే నగదుతో ఉడాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి