Breaking News

విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య


Published on: 20 May 2025 14:18  IST

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు (28) జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనను ఆర్మీ అధికారులు గోప్యంగా ఉంచడంతో, నాగరాజు కుటుంబానికి సమాచారం ఆలస్యంగా అందింది. ఈ రోజు (మే 20, 2025) ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు,అయితే అసలు నాగరాజు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. సమస్య ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి