Breaking News

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్


Published on: 18 Jun 2025 11:11  IST

మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి