Breaking News

మస్క్‌ వీలైనన్ని రోజులు కొనసాగాలి: ట్రంప్‌


Published on: 04 Apr 2025 15:50  IST

టెస్లా బాస్‌, డోజ్‌ సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అంటే తనకు అభిమానమని.. అతడు వీలైనన్నాళ్లు తన కార్యవర్గంలో కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ఆకాంక్షించారు. ఆయన గురువారం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మస్క్‌ నా కార్యవర్గంలో కొనసాగాలి. అతడిని ఇష్టపడటానికి చాలా కారణాలున్నాయి. ఒకటి: నేను అతడిని ఇష్టపడతాను, రెండు: అతడు అద్భుతంగా పనిచేశాడు, మూడు: అతడు ఓ దేశభక్తుడు’’ అని ట్రంప్‌ వివరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి