Breaking News

భారత పర్యటనకు వచ్చిన జర్మన్ విదేశాంగ మంత్రి


Published on: 02 Sep 2025 12:56  IST

జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం (మంగళవారం) బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు (సెప్టెంబర్ 3)న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌ను వాడేఫుల్ కలుస్తారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమవుతారు.

Follow us on , &

ఇవీ చదవండి