Breaking News

కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు..


Published on: 09 Feb 2026 18:48  IST

జిల్లాలోని తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి మావోయిస్టుల సామగ్రిని గుర్తించాయి. అయితే పోలీసుల సమాచారం ముందుగానే తెలుసుకున్న మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలిలో మావోలు ఉపయోగించిన వంటపాత్రలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి