Breaking News

విగ్రహాల ఏర్పాటుపై మండలిలో రచ్చ..


Published on: 24 Sep 2025 12:20  IST

బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాలు ఏర్పాటుపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. పులివెందులలో ప్రజా నిధులతో అనధికారికంగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి