Breaking News

మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ..


Published on: 17 Oct 2025 15:20  IST

వరంగల్ జిల్లాలోని నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది జూలైలో రూ.205 కోట్లును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ. 90 కోట్లు కేటాయించాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి