Breaking News

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌నూ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు


Published on: 18 Oct 2025 17:25  IST

దేశ జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వార్షిక టోల్‌పాస్‌ను మీకు నచ్చిన వారికి గిఫ్ట్‌గానూ ఇవ్వొచ్చని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పేర్కొంది. దీపావళి పండగ వేళ ఈ కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. రాజమార్గ ద్వారా ఈ పాస్‌ను బహూకరించొచ్చని పేర్కొంది. యాప్‌లోని యాడ్‌ పాస్‌ విభాగంలోకి వెళ్లి మీరు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి వాహన నంబర్‌, కాంటాక్ట్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి