Breaking News

ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్


Published on: 24 Oct 2025 12:13  IST

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను ప్రభుత్వం వెంటనే అందించాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి