Breaking News

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్..


Published on: 18 Nov 2025 11:57  IST

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మా­ర్చిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే తేదీల ఖరారుపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. దీంతో విద్యాశాఖ అధికారులు మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో ప్రభుత్వం దేనికి అనుమతి ఇస్తే.. ఆ ప్రకారంగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈలోగా సిబ్బంది నియామకం,  పరీక్ష సెంటర్లపై అధికారులు దృష్టి సారించారు.

Follow us on , &

ఇవీ చదవండి