Breaking News

భాగ్యనగరంలో మరోసారి భూముల వేలం..


Published on: 24 Nov 2025 15:48  IST

కోకాపేట, మూసాపేట భూములకు ఇవాళ నుంచి ఈ వేలం వేయనున్నారు హెచ్ఎండీఏ (HMDA) అధికారులు. కోకాపేటలో 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్న 16 ఎకరాల భూములకు వేలం వేసేందుకు సిద్దమయ్యారు. కోకాపేట నియోపోలీస్‌లో ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించారు.ఈరోజు కోకాపేట్‌, నియోపోలిస్‌ వెంచర్‌లోని 17, 18 ప్లాట్లలో ఉన్న 10 ఎకరాలకు ఈ వేలం వేయనున్నారు. నవంబర్‌ 28, డిసెంబర్‌ 3,5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి