Breaking News

27న గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం


Published on: 26 Nov 2025 12:34  IST

తెలంగాణ భవన్‌లో ఈనెల 27న మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. సమావేశానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్‌ 29న దీక్షా దివస్‌ను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి