Breaking News

ఢిల్లీలో ఎన్ కౌంటర్..ముఠా సభ్యుడి అరెస్ట్


Published on: 27 Nov 2025 16:13  IST

గురువారం ఢిల్లీలో యాంటీ నార్కోటిక్స్ సెల్ కు, హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అంకిత్‌కు మధ్య కాల్పులు జరగ్గా.. అతని కుడి కాలుకు బులెట్ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ తర్వాత అంకిత్ ను యాంటీ-నార్కోటిక్స్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. గత నెల చివర్లో రోహిత్ లాంబాపై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. హిమాన్షు భావు గ్యాంగ్ ఈ విషయంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇద్దరు ప్రధాన షూటర్లు పరారీలో ఉన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి