Breaking News

సబ్‌వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు..


Published on: 02 Dec 2025 14:36  IST

మంగళవారం ఉదయం చెన్నై మెట్రోకి చెందిన రైలు విమ్కో నగర్‌ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నది. ఈక్రమంలో సెంట్రల్‌ మెట్రో – హైకోర్టు స్టేషన్‌ మధ్య సబ్‌వేలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం, విద్యుత్‌ సరఫరాలో సమస్య తలెత్తడంతో రైలు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో మధ్యలోనే దిగిన ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పై నడవాల్సి వచ్చింది.  ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అధికారులు క్షమాపణలు కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి