Breaking News

మరో టెక్ కంపెనీ వార్నింగ్, ఐటీ ఉద్యోగులకు ఇక తప్పదు

దేశీయ IT దిగ్గజాలు ఒక్కొక్కటిగా ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. మొన్న TCS,, నేడు మరో టెక్ కంపెనీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పై వార్నింగ్ ఇచ్చాయి. ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. లేదంటే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపాయి. దీంతో IT ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు.


Published on: 15 Feb 2024 12:58  IST

దేశీయ IT కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీసు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే TCS ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులు కచ్చితంగా వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఇప్పుడు మరో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) కూడా అదే దారిలో నడుస్తోంది. ఉద్యోగులు వారానికి 3 రోజులు కచ్చితంగా ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఎవరైనా  ఆదేశాలను పాటించకపోతే వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకంటామని హెచ్చరించాయి.

హెచ్‌సీఎల్‌ టెక్ తాజా ఆదేశాలు ఫిబ్రవరి 19, 2024 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. అంటే ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి 3 రోజులు ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.ఇప్పటికే  ఇన్ఫోసన్, టీసీఎస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశించాయి. ఇప్పుడు వాటి దారిలోనే  హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) సైతం నడుస్తూ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసులకు రావాల్సింది అని ఆదేశించింది. అలాగే విప్రోలో వారానికి 3 రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది.
 

Follow us on , &

ఇవీ చదవండి