Breaking News

ఈ కారులో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌లు, వెంటిలేటెడ్ సీట్ల కోసం టచ్ ప్యానెల్ కూడా అమర్చనుందని తెలుస్తోంది..

కియా ప్రసిద్ధ MPV కారెన్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు. కంపెనీ మూడు సంవత్సరాలలో ఈ కారు 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.


Published on: 18 Mar 2025 18:55  IST

ఈ కారు ప్రజల నుండి చాలా ప్రేమను పొందుతోంది. దీని కారణంగా కంపెనీ ఇప్పుడు ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కియా కారెన్స్ అప్‌గ్రేడ్ చేసిన మోడల్‌లో బయట, లోపల భాగంలో అనేక మార్పులు చేసింది. కొత్త కియా కారెన్స్‌లో మీరు కొత్త కియా సిర్రస్ హెడ్‌లైట్ డిజైన్‌ను చూడవచ్చు. అదనంగా బూట్‌లోని టెయిల్ లాంప్‌లు ఒక వైపు నుండి మరొక వైపుకు కనెక్ట్ చేసినట్లు తెలుస్తోందిన. ఈ కస్టమర్ ఫేవరెట్ కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 7 సీటర్స్‌తో ఏప్రిల్ లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ TFT స్క్రీన్‌లు, ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఈ కారులో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌లు, వెంటిలేటెడ్ సీట్ల కోసం టచ్ ప్యానెల్ కూడా అమర్చనుందని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా కస్టమర్ల కోసం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ కియా కారెన్స్ EV ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కియా కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 42kWh, 51.4kWh బ్యాటరీ ఎంపికలలో విడుదల చేయవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి