Breaking News

ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్: సరికొత్త స్పోర్టీ లుక్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ విడుదల

ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్: సరికొత్త స్పోర్టీ లుక్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ విడుదల


Published on: 02 May 2025 15:39  IST

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్య సమస్యల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో చాలా దేశాలు ఈ రంగానికి ఊతమిస్తున్నాయి. భారత్‌లోనూ ఈవీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పించడంతో మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

ఈవీ స్కూటర్లకంటే తక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో తాజాగా ఓ కొత్త ఆఫర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడిస్సీ, ‘ఎవోకిస్ లైట్’ పేరుతో ఒక స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది.

ఈ బైక్ ధర రూ.1.18 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఈ బైక్ 90 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. దీంట్లో 60 వోల్ట్స్ బ్యాటరీ ఉపయోగించబడింది.

బైక్‌కు సంబంధించిన వివరాలను సంస్థ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా వెల్లడిస్తూ, స్పోర్ట్స్ లుక్‌తో ఆకట్టుకునేలా ఉండే ఈ బైక్‌ను, అందరికీ అందుబాటులో ఉండే ధరకు అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

ఈవోకిస్ లైట్ ప్రత్యేకతలు:

  • కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్

  • మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు

  • మోటార్ కట్ ఆఫ్ స్విచ్

  • యాంటీ థెఫ్ట్ సిస్టమ్

  • స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీ

ఈ బైక్ ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది: కోబాల్ట్ బ్లూ, ఫైర్ రెడ్, లైమ్ గ్రీన్, మాగ్నా వైట్, బ్లాక్. స్టైలిష్ లుక్, మోడరన్ ఫీచర్లు, బడ్జెట్ ధర – ఇవన్నీ కలిపి ఈ బైక్ యువతకు కొత్త అట్రాక్షన్‌గా మారే అవకాశముంది.

Follow us on , &

ఇవీ చదవండి