Breaking News

చైనీస్ EV ఆటోమొబైల్ కంపెనీ BYD కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

ఆటో మొబైల్‌ రంగంలో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు.


Published on: 18 Mar 2025 18:50  IST

చైనీస్ EV ఆటోమొబైల్ కంపెనీ BYD కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి తీసుకునేంత వేగంగా ఛార్జ్ చేయగలవు. ఈ టెక్నాలజీ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే 470 కి.మీ. వరకు పరిగెత్తగలదని బైడ్ కంపెనీ  ఛైర్మన్ వాంగ్ చువాన్ఫు వివరించారు. కొత్త టెక్నాలజీతో కూడిన కార్లు ఏప్రిల్ 2025 నుండి మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది.ఈ కొత్త ఛార్జింగ్ వ్యవస్థను హ్యాన్ ఎల్ సెడాన్ నో పరీక్షించినట్లు బైడ్ కంపెనీ తెలిపింది. 

ఈ కార్ల ధర రూ.31 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కొత్త EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కార్లు కేవలం 2 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోగలవు.

ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ లో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, ఛార్జింగ్ పాయింట్లు సమస్యగా మారుతున్నాయి వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడానికి, వినియోగదారుల సౌలభ్యం కోసం BYD దేశవ్యాప్తంగా 4,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది కాని ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రాలేదు.

ప్రస్తుతం విద్యుత్ వాహన రంగంలో టెస్లా అగ్ర స్థానంలో ఉంది. ఈ కంపెనీ సూపర్ ఛార్జర్లతో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా సూపర్ ఛార్జర్లు 65,000 కు పైగా ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కూడా ఇటీవలే సీఎల్ఏ ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంఛ్ చేసింది. దీన్ని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

ఇలాంటి పరిస్థితుల్లో బైడ్ 5 నిమిషాల్లోనే 470 కీలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యంతో కొత్త వ్యవస్థను ఆవిష్కరించడం కంపెనీకి చాలా ప్లస్ అని చెప్పవచ్చు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే టెస్లాకు బైడ్ గట్టీ పోటీ ఇస్తుంది.

జనవరి 2025లో BYD 318,000 వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 161 శాతం ఎక్కువ. చైనాలో దాని మార్కెట్ వాటా 15 శాతానికి చేరుకుంది. ఇది దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారుగా నిలిచింది. ఇది కాకుండా బీవైడీ షేర్ ధర 45 శాతం పెరిగింది. కంపెనీ కొత్త ఈవీ టెక్నాలజీ, ఆటో-పైలట్ ఫీచర్లు భవిష్యత్తులో దాని అమ్మకాలను మరింత పెంచుతాయి. అదే సమయంలో బీవైడీ కొత్త సూపర్ ఇ-ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ CATL వంటి బ్యాటరీ కంపెనీలకు పోటీని మరింత తీవ్రతరం చేస్తుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి