Breaking News

రూ.20,000 లోపు బెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్లు

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మిడ్‌ రేంజ్‌ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. అధిక శాతం మంది రూ.20,000 ధర లోపల ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ధరలో శాంసంగ్‌, రెడ్‌మీ, మోటోరోలా, పోకో, ఇన్‌ఫినిక్స్‌ వంటి అనేక సంస్థలు 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి.


Published on: 21 Aug 2023 18:27  IST

Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే విడుదల అయింది. ఈ ఫోన్ వెనుకవైపు గ్లాస్‌ మెటీరియల్‌తో వస్తుంది. ఫలితంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ ‌కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా సహా 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M34 స్మార్ట్‌ఫోన్‌ Exynos 1280 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. గెలాక్సీ M34 ఫోన్‌ 4 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనుంది. మరియు ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. వెనుకవైపు 50MP OIS కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB వేరియంట్‌ ధర రూ.18,999గా ఉంది.

మోటోరోలా G73 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డెమెన్సిటీ 930 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు 50MP + 8MP కెమెరాలు, ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 6.5 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 8GB ర్యామ్‌, 128GB వేరియంట్‌ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు.

పోకో X5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా, 8MP ఆల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB వేరియంట్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,999గా ఉంది. కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్‌ తో రూ.19,999 కే కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంతవరకు వేచిచూడాల్సి ఉంటుంది.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి