Breaking News

బీఆర్ఎస్‌కు షాక్.. తీగల కృష్ణారెడ్డి రాజీనామా!!

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్ది బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి క్యూ కట్టారు. అయితే ఇటీవలే తన కోడలితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామ లేఖలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


Published on: 26 Feb 2024 17:43  IST

పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన జంపింగ్ జపాంగుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజే జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూడా. ఈ క్రమంలోనే గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కృష్ణా రెడ్డితో పాటు ఆమె కోడలు.. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పారు.

రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. అయితే, రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణారెడ్డి. పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు తీగల కృష్ణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో అధిష్ఠానం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి