Breaking News

హైదరాబాద్‌ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని నాంపల్లి (రెడ్ హిల్స్) ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TSFSL)కార్యాలయంలో ఈరోజు, శనివారం (ఫిబ్రవరి 7, 2026) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 

Published on: 07 Feb 2026 12:35  IST

హైదరాబాద్‌లోని నాంపల్లి (రెడ్ హిల్స్) ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TSFSL)కార్యాలయంలో ఈరోజు, శనివారం (ఫిబ్రవరి 7, 2026) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.భవనం నుండి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సిబ్బంది భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలు ఆర్పే క్రమంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.ఈ ల్యాబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేసులకు సంబంధించిన కీలకమైన దర్యాప్తు పత్రాలు, రసాయనాలు మరియు నివేదికలు ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల ఏవైనా కీలక ఆధారాలు కాలిబూడిదయ్యాయా అనే కోణంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి