Breaking News

ఏపీఎస్ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా

జోగులాంబ గద్వాల జిల్లాలో ఫిబ్రవరి 19, 2026 గురువారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 

Published on: 19 Feb 2026 11:32  IST

జోగులాంబ గద్వాల జిల్లాలో ఫిబ్రవరి 19, 2026 గురువారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 

ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement