Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

2026 ఫిబ్రవరి 18, బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. 


Published on: 19 Feb 2026 12:41  IST

2026 ఫిబ్రవరి 18, బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. బోథ్ మండలంలోని దన్నూర్ (బి) గ్రామానికి చెందిన దోపతి సురేందర్ (33).సురేందర్ మంగళవారం పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్లి, తిరిగి బుధవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బోథ్ మండలం పరిధిలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఎదురుగా వచ్చిన మరొక బైక్ సురేందర్ బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సురేందర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి